Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pawan Kalyan Issues Strong Warning To Ys Jagan At Amarajeevi Jaladhara Project Launch

Deputy CM Pawan Kalyan: వైఎస్‌ జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..

Published Date :December 20, 2025 , 1:35 pm
By Sudhakar Ravula
  • వైఎస్‌ జగన్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌..
  • అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారు..
  • విదేశాల్లో కూర్చుని వాగేవాళ్లను, “మేమొస్తే” అంటూ బెదిరించే వారిని ఏం చేయాలి..
  • కిరాయి గ్యాంగ్‌లపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే జగన్‌ ఎక్కడ ఉంటారు..?
Deputy CM Pawan Kalyan: వైఎస్‌ జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Deputy CM Pawan Kalyan: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా రూ.3,050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చుని వాగేవాళ్లను, ఇక్కడ ఉండి “మేమొస్తే” అంటూ బెదిరించే వారిని ఏం చేయాలన్నదే తన ప్రశ్న అని పవన్‌ వ్యాఖ్యానించారు. కిరాయి గ్యాంగ్‌లపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే, అప్పుడు జగన్‌ ఎక్కడ ఉంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

Read Also: Bihar Hijab Controversy: హిజాబ్ వైద్యురాలికి బంపర్ ఆఫర్.. 3లక్షల జీతం.. కోరుకున్న ఉద్యోగం.. ఎక్కడంటే..!

Also Read

  • CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..
  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌
  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

గత ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. సమాజంలో చీలికలు తెచ్చేలా పిల్లలకు చిన్న వయసులోనే కులాలను అంటగట్టడం సరికాదని అన్నారు. ఇది రాజకీయం కాదని, సమాజాన్ని వెనక్కి నెట్టే విధానమని విమర్శించారు. అధికారం ఉన్నా లేకపోయినా తాను పవన్‌ కల్యాణ్‌లాగే ఉంటానని స్పష్టం చేశారు. అన్నీ డిసైడ్‌ అయ్యే ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, ప్రజల్లోకి వచ్చి మాట్లాడే వ్యక్తినని అన్నారు. అవసరమైతే యోగీ ఆదిత్యనాథ్‌ తరహా విధానాలు అవలంబిస్తేనే కొన్ని సమస్యలు సరిదిద్దబడతాయని అభిప్రాయపడ్డారు.

సోషల్‌ మీడియాలో చెత్త ప్రచారం, దూషణలకు పాల్పడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు పవన్‌ కల్యాణ్… సమాజం, రాష్ట్రం, ప్రజలపై కమిట్మెంట్‌తోనే తాను పనిచేస్తున్నానని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా నిర్మాణాత్మక సూచనలు ఇస్తామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమన్నారు. ధైర్యం లేని సమాజానికి, ధైర్యం లేని నాయకులు ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే చనిపోయే ముందు కూడా చాలా మంది తాట తీసేంత వరకు పోరాడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరజీవి జలధార ప్రాజెక్ట్‌ ఏ ఒక్క కులానికి సంబంధించినది కాదని, ఇది అన్ని వర్గాలకు చెందిన ప్రజల ప్రాజెక్ట్‌ అని పవన్‌ స్పష్టం చేశారు. 2027 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కావాల్సిందేనని కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు పవన్‌ కల్యాణ్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amarajeevi Jaladhara Project
  • Andhra Pradesh Politics
  • AP Coalition Government
  • AP Deputy CM Pawan Kalyan
  • ap political news

తాజావార్తలు

  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..

  • Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

  • Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..

  • Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!

  • Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions