Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలకు ముందు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాజమండ్రిలో గోదావరి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు కొనసాగిస్తూ, గోదావరిలో పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి బోటు ప్రయాణం చేసి కాలుష్య పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలించారు.
వెంకటనగరం సమీపంలో ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అధికారులతో కలిసి నీటి శాంపిల్స్ సేకరింపజేశారు. ఆకస్మిక తనిఖీల్లో కాలుష్య నియంత్రణ నిబంధనల అమలులో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “పవిత్ర గోదావరిలో కాలుష్య వ్యర్థాలు కలవడం చాలా దారుణం. పుష్కరాల సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం కాదు, రోగాలు వస్తాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏలూరులో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ, పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు.
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
“రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే. కానీ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరిదే. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై అసెంబ్లీ, కేబినెట్ సమావేశాల్లో చర్చిస్తాం” అన్నారు పవన్ కల్యాణ్.. తనిఖీల సందర్భంగా పర్యావరణ శాఖ బాధ్యతలపై మంత్రి కందుల దుర్గేష్‌ను ఉద్దేశించి కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “పుష్కరాల రేవులను అందంగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు, గోదావరిలో కాలుష్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది” అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పేపర్ మిల్ కాలుష్య సమస్యపై తాము నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించి చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించారు.
తాజావార్తలు
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!