NTV Telugu Site icon

Nara Bhuvaneswari: రాజమండ్రి ప్రజలను నేను మర్చిపోలేను.. వారికి పాదాభివందనాలు.. భువనేశ్వరి భావోద్వేగం..

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari: రాజమండ్రి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదన్న ఆమె.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి..

Read Also: Akira: మెగా ఫ్యాన్స్ కి పూనకాలే.. విశ్వంభరలో చిరంజీవితో అకీరా ?

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి.. బ్లడ్‌ బ్యాంక్‌ను ప్రారంభించారామె.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 53 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు.. ఈ ప్రాంత దాతలు, ప్రజలు అందించిన సహకారం మరువలేనిది అన్నారు.. రాజమండ్రి ప్రజల రుణం తీర్చుకోవడానికే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు.. రాష్ట్రంలో ఇది నాలుగోవ బ్లడ్ బ్యాంక్.. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ద్వారా 4 లక్షల 8 వేల మందికి రక్తదానం చేసిందని వెల్లడించారు.. ఎన్టీఆర్ సృజల ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నాం అన్నారు.. ఇక, రాజమండ్రి ప్రజలను నేను ఎప్పుడూ మర్చిపోలేను.. రాజమండ్రివారి గురించి ఎంత చెప్పినా నా మనసుకు తృప్తి ఉండదు.. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.. అందరికీ పాదాభివందనాలు అని వ్యాఖ్యానించారు నారా భువనేశ్వరి..

Read Also: Call Money Danda: కాల్ మనీ దందా.. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూళ్లు.. ఊరు వీడుతున్న బాధితులు..!

ఇక, వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా తిరుమలలో లడ్డు వివాదం బాధాకరం అంటూ నారా భువనేశ్వరి విచారం వ్యక్తంచేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం. వంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఏర్పాటుచేసిన బ్లడ్ బ్యాంకు, ఉచిత మొబైల్ క్లినిక్ లను. భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా. భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని నా భర్త ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారిస్తారని అన్నారు. నిజం గెలవాలని నేను ప్రచారం చేసినప్పుడు ప్రజల సమస్యలు చూశానని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చినంత ఆనందంగా ప్రజలు సంతోషపడ్డారని అన్నారు. వందరోజుల పాలన సమర్థవంతంగా నిర్వహించారని కితాబు ఇచ్చారు. తన కోడలు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రారని. వెల్లడించారు . ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్గ్ గా. బ్రాహ్మణి సేవలందిస్తున్నారని తెలిపారు.