Kadiyam Nursery Gang R*ape and Murder Case: కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య.. కోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadiyam Nursery Gang Rape and Murder Case: సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో.. కీలక తీర్పు వెలువరించింది కోర్టు.. కడియం మండలంలో జరిగిన నర్సరీ మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులైన నలుగురు యువకులకు మరణం వరకూ జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి కోర్టు తీర్పు వెల్లడించింది.
Read Also: Bengal Elections: మమతా సర్కారుకు షాక్.. సీఎస్, డీజీపీల ట్రాన్స్ఫర్..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
కాగా, కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన 43 ఏళ్ల వివాహిత రౌతు కస్తూరి స్థానిక నర్సరీలో పని చేసేది. 2024 అక్టోబర్ 15న ఆమె నర్సరీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పటికీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్‌గా వచ్చింది. దీంతో వారు చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. తరువాత 2024 అక్టోబర్ 16న కస్తూరి భర్త కడియం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో 2024 అక్టోబర్ 17న చొప్పల్ల లాకుల వద్ద కాలువలో కస్తూరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు.
నేరం ఎలా జరిగింది
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, నర్సరీలో మద్యం సేవిస్తున్న నలుగురు యువకులు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న కస్తూరిని అడ్డగించారు. ఆమె కాళ్లు చేతులు కట్టి నర్సరీ మొక్కల మధ్యకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను హత్య చేసి సమీపంలోని ప్రధాన పంటకాలువలో పడేశారు. అయితే, ఈ కేసులో బుర్రిలంక గ్రామానికి చెందిన దేవర యేసు (21), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), అలాగే పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి సురేష్ (22) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 70(1), 103(1), 238 రీడ్ విత్ 3(5) ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. అనంతరం పూర్తి దర్యాప్తు చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు.
కోర్టు తీర్పు
ఈ కేసును ఫాస్ట్ ట్రాక్‌గా విచారించిన రాజమండ్రి నాలుగవ అదనపు జ్యుడీషియల్ కోర్టు న్యాయమూర్తి నిందితుల నేరం రుజువైన నేపథ్యంలో నలుగురికి మరణం వరకూ జీవిత ఖైదు శిక్ష విధించారు. అయితే, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ మహిళలపై జరిగే దారుణ నేరాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్‌గా పరిగణించి కేవలం 11 నెలల్లోనే విచారణ పూర్తి చేశామని చెప్పారు. మొత్తం 14 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
- Tags
తాజావార్తలు
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
-
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!