మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని ఆకాశానికెత్తేశారు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు. శ్రీకాకుళంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాలు జరిగాయి. జలగం వెంగళరావు రాజాం దగ్గర సోపేరు అనే చిన్న గ్రామంలో జన్మించారన్నారు మంత్రి ధర్మాన. మొదట్లో జలగం వెంగళరావు శ్రీకాకుళంలో జన్మించారని చాలామందికి తెలియదు.
జిల్లా నుండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వెంగళరావు ఒక్కరే అన్నారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన వ్యక్తి. గతంలో పనిచేసిన వారిలో ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి అని పాత IAS లను అడిగితే.. అందరూ వెంగళరావు పేరు చెబుతారు. ఒక్కసారి కూడా ఆయన పై ఎలాంటి ఆరోపణ రాలేదు. కొత్త జనరేషన్.. వెంగళరావుని ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
శ్రీకృష్ణ దేవరాయలు, నాగార్జున యూనివర్సిటీ ఆయన ఏర్పాటు చేసినవే. అనేక సాగునీటి ప్రోజక్ట్ ల నిర్మాణానికి వెంగళరావు ముందడుగు వేసారు. కేంద్ర పరిశ్రమల శాఖ ల మంత్రిగా ఉండి బొబ్బిలి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సహకరించారు. జనార్ధన్ రెడ్డి క్యాబినెట్ లోకి నన్ను మంత్రిగా తీసుకోమని జలగం వెంగళరావు, వైఎస్సార్ లే సిఫార్సు చేశారు. జలగం వెంగళరావు విగ్రహం పెట్టాలని తీర్మానం చేసారు. కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తాం. జిల్లాలోని ఏదైనా ఓ కొత్త ప్రాజెక్ట్ కి వెంగలరావు పేరు పెట్టమని సిఎం జగన్ ని కోరుతానన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
CM Jagan: రేపు తిరుపతిలో సీఎం జగన్ టూర్