Devineni Uma: ఢిల్లీ వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న జగన్.. పోలవరం డబ్బులు తెచ్చుకోలేరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Desam Party Leader Devineni Uma: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కాఫర్ డ్యాం ఎత్తు పెంచడానికి పీపీఏ అనుమతిచ్చిందా లేదా సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ చెప్పారంటూ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచేస్తామని మంత్రి అంబటి రాంబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచడానికి అనుమతిలిచ్చారా? లేదా అనే అంశంపై ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని దేవినేని ఉమ సూటి ప్రశ్న వేశారు. పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టి వెళ్లారని.. రాంబాబుకేం తెలియదు.. తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
Read Also: Andhra Pradesh Politics : నో కాంప్రమైజ్ అంటున్న విశాఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం డ్యామ్‌కు సంబంధించి ఎంత పని చేశారో చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను చూపించి.. తామే కట్టామని కేంద్రానికి చూపించుకున్నారని చురకలు అంటించారు. టీడీపీ హయాంలో చేసిన పోలవరం పనులకు సంబంధించి రూ. 4 వేల కోట్ల నిధులు తెచ్చుకుని.. లిక్కర్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులిచ్చారని దేవినేని ఉమ ఆరోపించారు. నిర్వాసితులకు డబ్బులు ఇచ్చారా అని నిలదీశారు. ఢిల్లీ వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న సీఎం జగన్.. పోలవరం నిధులు తెచ్చుకోలేరా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. తాము వాస్తవాలు మాట్లాడితే పొడుచుకు వచ్చిందా అని నిలదీశారు. చంద్రబాబు మీద.. దేవినేని ఉమ మీద పడి ఏడ్వడం దేనికంటూ మండిపడ్డారు. పోలవరం గురించి తనను అడగొద్దంటూ ఓ మాజీ మంత్రి అంటే.. ఇప్పుడు వచ్చిన మంత్రి రాంబాబు తెగ ఆక్రోశపడిపోతున్నాడని కౌంటర్ ఇచ్చారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను వైఎస్ హయాంలో ఎందుకు ప్రీ-క్లోజర్ చేశారో చెప్పాలన్నారు.
వైఎస్ పార్ధివ శరీరం దగ్గరే జగన్ పోలవరం ప్రాజెక్టులో కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో మీటింగ్ పెట్టారని దేవినేని ఉమ విమర్శలు చేశారు. వైఎస్ ప్రభుత్వం చేసిన పోలవరం పాపాన్ని కడిగి నిర్మాణం మొదలు పెట్టింది టీడీపీనే అన్నారు. తాడేపల్లిలో హెలికాప్టర్ ఎందుకు.. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు పంపివచ్చుగా అని సూచించారు. పోలవరంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. పేపర్ లేకుండానే పోలవరంపై చర్చకు వస్తానని దేవినేని ఉమ స్పష్టం చేశారు. పోలవరం డ్యాంపై పెడతారో లేదా తాడేపల్లి ప్యాలెస్ గేట్ ముందు చర్చ పెట్టినా తాను వస్తానన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామంటూ రకరకాల డెడ్ లైన్లు పెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాంబాబు సొల్లు కబుర్లు చెప్పొద్దని.. చించుకుని మాట్లాడొద్దని హితవు పలికారు. చించుకుని మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దన్నారు. రాంబాబు సబ్జెక్ట్ నేర్చుకో.. బుర్ర పెట్టు అని దేవినేని ఉమ చురకలు అంటించారు.
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!