Pawan Kalyan: ప్రభుత్వాలను నిందించడానికో.. రాజకీయ లబ్ది కోసమో ఈ దీక్ష చేపట్టడం లేదు..
- ప్రాయశ్చిత్త దీక్షను మొదలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసిన డిప్యూటీ సీఎం..
- 11 రోజుల పాటు కొనసాగనున్న ప్రాయశ్చిత్త దీక్ష: ఉప ముఖ్యమంత్రి పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రం కావడంతో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేపట్టి దీక్షను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ది కోసమో నేను ఈ దీక్ష చేపట్టడం లేదన్నారు. స్వామి వారి పూజా విధానాలు మార్చేశారు.. శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారు.. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారని ఆయన ఆరోపించారు. ఏ మతమైనా కావచ్చు ఏ ప్రార్థనా మందిరం కావచ్చు.. మనోభావాలు దెబ్బ తినకూడదు.. ప్రసాదాల్లో కల్తీ జరుగుతోంది.. నాణ్యత లేదని ముందు నుంచీ చెబుతున్నాం.. టీటీడీపై వైట్ పేపరు రావాలని కోరుకున్నాం.. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదు.. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Kalindi Express: దారుణం.. మరోసారి రైలు ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్..
Also Read
రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటోంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని.. ఆ రోజు రాజకీయం చేయలేదు..
దాడులు జరుగుతున్నప్పుడు చూస్తు కూర్చుకోడం కూడా తప్పే.. ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు.. పగ ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదు.. తప్పులు చేయడం అలవాటు అయింది.. దీనికి పుల్ స్టాప్ పెట్టాలి అన్నారు. వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఉన్న బోర్డు ఏం చేసింది..? అని ఆయన చెప్పుకొచ్చారు. తప్పులు చేసిన వారిని వెనకేసుకురావద్దు.. చర్చి, మసీదులో జరిగితే ప్రపంచం అంతా గొడవ చేస్తారు.. హిందువులకు మనోభావాలు ఉండవా..?.. ఇదే ఇతర మతాలకు అన్వయిస్తారా..? అని చెప్పారు. సనాతన ధర్మం ఒకరు ప్రారంభించింది కాదు.. అన్ని విశ్వాసాలను దగ్గరకు తీసుకున్న నేల ఇది.. దోషులకు శిక్ష పడాలని పవన్ చెప్పారు.
Read Also: Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?
టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి.. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా..? హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనుకేసుకొస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశం కెబినెట్, అసెంబ్లీలో చర్చ జరిగాలి.. సీబీఐ విచారణకి ఇవ్వాలో లేదో సీఎం నిర్ణయం తీసుకోవాలి.. ఆయన వెనుకే ప్రజలంతా ఉంటారు.. నెయ్యి తక్కువ ధరకు ఇస్తారని చెప్పిన మధ్యవర్తి ఎవరో తేలాలి అని ఆయన చెప్పుకొచ్చారు. స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందు అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదు..? అన్నారు. టీటీడీ ఉద్యోగులు కామ్ గా ఉండి మహాపరాధం చేశారు.. అందుకే దీక్ష తీసుకున్నాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
తాజావార్తలు
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!