AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
- మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
- పార్టీ నుంచి బహిష్కరణ..
- వెంటనే రాజీనామాకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIMIM: ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కీలక నిర్ణయం తీసుకుంది. మిర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ వెల్లడించారు. పార్టీ నుంచి బహిష్కరణతో పాటు మిర్జా రహమత్ బేగ్ తన పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని ఎంఐఎం ఆదేశించింది. రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో లీక్ వ్యవహారమే ఈ చర్యకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వీడియో లీక్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే మిర్జా రహమత్ బేగ్‌పై పార్టీ చర్యకు దారితీసిన ఇతర కారణాలను ఎంఐఎం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మిర్జా రహమత్ బేగ్‌పై పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మిర్జా రహమత్ బేగ్.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా అనే చర్చ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.. ఇటీవలే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.. ఈ లోగా.. మిర్జా రహమత్ బేగ్‌పై చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.. పార్టీ ఆదేశాల ప్రకారం మిర్జా రహమత్ బేగ్ ఎమ్మెల్సీ పదవికి కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చింది..
Also Read
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!