Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు భారీగా గంజాయి లభ్యమైంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహించే వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ వ్యాపారం బయటపడింది. రోడ్డుపై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఒక కారును పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో కారు లోపల రహస్యంగా దాచిన సుమారు 61 కిలోల డ్రై గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి మార్కెట్ విలువ దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సడక్డ్త్, సధవ్, సల్మాన్ అనే ముగ్గురిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 61 కిలోల డ్రై గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన కారును, వారు ఉపయోగిస్తున్న మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఈ గంజాయిని ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతం నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. అక్కడ నుంచి రాజమండ్రి మీదుగా కారులో ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకు ప్రణాళిక రచించినట్లు నిందితులు అంగీకరించారు. అయితే మార్గమధ్యలో బూరుగుపూడి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలతో వీరి వ్యూహం విఫలమైంది.
Also Read
- Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
- AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
పోలీసులు జరిపిన లోతైన విచారణలో ఈ ముగ్గురు నిందితులపై గతంలోనే ఢిల్లీలో కూడా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరు పదే పదే వేర్వేరు రాష్ట్రాల నుంచి గంజాయిని సేకరించి ఇతర ప్రాంతాలకు అక్రమంగా చేరవేసే ముఠాగా పనిచేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ప్రధాన సూత్రధారులు ఉన్నారా, ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్ వరకు వీరికి ఉన్న నెట్వర్క్ ఏమిటి అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!