NTV Telugu Site icon

Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ

Kottu Satyanarayana On Pk

Kottu Satyanarayana On Pk

Deputy CM Kottu Satyanarayana Fires On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని.. ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అని దుయ్యబట్టారు. అసలు తానేం మాట్లాడుతున్నాడో, అతనికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ మాటలు చూస్తుంటే.. అతని మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా బాధ్యత తీసుకుంటానని ఓసారి.. సీఎం అయ్యే బలం‌ లేదని, పొత్తులుంటాయని మరో దగ్గర పవన్ చెప్తాడని అన్నారు. కత్తిపూడి సభలో సీఎం అయ్యేందుకు సంసిద్ధంగా ఉన్నానని పవన్ చెప్తాడని, అసలు పవన్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం అవుతోందా? అని నిలదీశారు. ద్వారంపూడి విసిరిన సవాల్‌కి పవన్ తోక ముడిచాడంటూ కౌంటరిచ్చారు.

Alla Nani: పవన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.. మాజీ మంత్రి ధ్వజం

కాపుల మనోభావాలు దెబ్బతీసేలా ముద్రగడపై పవన్ అవాకులు చవాకులు పేలాడని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. నరసాపురంలో మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాడని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల టూర్ తర్వాత పవన్ మానసిక స్ధితిని అనుమానించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోందని సందేహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రతో పవన్ గ్రాఫ్ పదింతలు తగ్గిపోయిందని అన్నారు. పవన్ సభలకి వచ్చే జనాలు వేల సంఖ్యల నుంచి వందల సంఖ్యకి పడిపోయిందన్నారు. పవన్ ద్వారా గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు చీల్చాలని చంద్రబాబు వేసిన‌ పాచిక‌ పారలేదని తేల్చి చెప్పారు. అసలు కాపు ద్రోహి అయిన చంద్రబాబు పంచెన పవన్ ఎందుకు చేరాడో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి గొడవలోనూ జనసేన కార్యకర్తలే ఉంటారని, తమ కార్యకర్తల్ని గూండాలుగా, రౌడీలుగా తయారు చేసేలా పవన్ రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు.

Titan tragedy: టైటాన్‌కి “టైటానిక్ శాపం” తగిలిందా..? పలు సంఘటనల ఆధారంగా రూమర్స్..

రాష్ట్రం అగ్నిగుండంగా మారిందంటూ.. చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో పవన్ కళ్యాణ్ ఏ రోజూ ప్రశ్నించలేదన్నారు. మా పాలన చూసి ఓటు వేయమని ప్రజల్ని అడుగుతున్నామని.. మరి 2014-19 పాలన చూసి ఓటు వేయమని మీరు అడగలరా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. 219 దేవాలయాల్ని కూల్చేశామని పవన్ చెప్తున్నాడని.. మరి చంద్రబాబు హయాంలో గుళ్లు కూల్చేయలేదా? అని అడిగారు. సీఎం జగన్ కూల్చేసిన గుళ్లను తిరిగి నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Show comments