అసని తుఫాన్ ఏపీపై విరుచుకుపడుతోంది… ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తీరం వైపు అసని దూసుకొస్తుండడంతో ఆ ఎఫెక్ట్ తీర ప్రాంతాలపై పడుతోంది.. ఇక, రేపు తీరం దాటనున్న నేపథ్యంలో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది.. ప్రస్తుతం కాకినాడకు ఆగ్నేయ౦గా 210 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది అసని తీవ్ర తుఫాన్.. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ముందుకు…
తీరం వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా విశాఖలో భారీ వర్షం పడుతోంది… అయితే, ‘అసని’ తుఫాన్ దిశ మార్చుకున్నట్టు వాతావరణశాఖ చెబుతోంది.. రేపు సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని.. మచిలీపట్నం దగ్గర తుఫాన్ తీరం దాటే సూచనలు ఉన్నాయని… దీని ప్రభావంతో.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇక, దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ…
బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరం వైపు పయణిస్తోంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో పయణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో వాతావరణం మారిపోయింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా…