Cricketer KS Bharat Met With CM YS Jagan In His Tadepalli Camp Office: గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో క్రికెటర్ కేఎస్ భరత్ (కోన శ్రీకర్ భరత్) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ట్రంలో క్రీడా సంబరాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న ఏపీ ప్రభుత్వం.. క్రీడల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రానికి చెందిన క్రికెటర్ల సేవల్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈరోజు యువజన, క్రీడా శఖపై సమీక్ష సందర్భంగా.. క్రీడలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే క్యాంపు కార్యాలయానికి కేఎస్ భరత్ వచ్చాడు. ఈ సందర్భంగా.. అతడ్ని సీఎం జగన్ అభినందించారు. అటు.. టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి కేఎస్ భరత్ బహుకరించాడు.
Botsa Satyanarayana: డ్యాన్సులు చేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా.. బొత్స కౌంటర్
అనంతరం కేఎస్ భరత్ మాట్లాడుతూ.. ఇండియన్ క్రికెట్ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు గర్వంగా ఉందన్నాడు. ఈ విషయాలను తాను సీఎం జగన్‌తో పంచుకున్నానని, ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారని చెప్పాడు. తనకు మద్దతు కావాలని కోరగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారన్నాడు. దేశం గర్వపడేలా ఆంధ్ర రాష్ట్రం పేరు, ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం తనకు సూచించారని పేర్కొన్నాడు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని.. స్పోర్ట్స్ ప్రమోషన్ కూడా బాగుందని తెలిపాడు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రోత్సాహం అందిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు. ఈ ప్రోత్సాహం వల్ల.. తనలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారన్నాడు. కాగా.. కొద్ది రోజుల కిందట సీఎం జగన్‌తో మరో క్రికెటర్ అంబటి రాయుడు కూడా సమావేశమైన సంగతి తెలిసిందే!
Cyclone Biparjoy: తీరాన్ని తాకిన పెను తుఫాన్.. 50 కి.మీ వ్యాసంతో “సైక్లోన్ ఐ”