నాన్ బీజేపీ రాష్ట్రాల సీఎంలను సీపీఐ జాతీయ సభలకు ఆహ్వానిద్దామని భావించాం.. కానీ దాన్ని విరమించుకున్నాం. కొందరు సీఎంలు ఇంకా ఊగిసలాడుతున్నారు. సీపీఐ జాతీయ సభలు ముగిశాక మరిన్ని సంప్రదింపులు జరిపి నాన్ బీజేపీ సీఎంలతో సమావేశం నిర్వహిస్తాం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రేపట్నుంచి సీపీఐ జాతీయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న సీపీఐ నేతలు.. శ్రేణులతో పాటు 12 విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సీపీఐ అగ్ర నేతలే కాకుండా లెఫ్ట్ పార్టీలకు చెందిన నేతలూ హాజరు కానున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తులను ఏకం చేసే అంశంపై జాతీయ సమావేశాల్లో చర్చిస్తాం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో విబేధిస్తున్న పార్టీలు.. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని కోరుతున్నాం. బీజేపీని వ్యతిరేకించేందుకు ఎవరు ముందుకొచ్చిన మేం సహకరిస్తాం. ప్రాంతీయ పార్టీల్లో బలమైన శక్తిగా ఉన్న పార్టీ వైసీపీ. అంత బలంగా ఉన్న వైసీపీ.. బీజేపీకి ఎందుకు సహకరిస్తుందో అర్థం కావడం లేదు. కేంద్ర విధానమైన వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించాలనే నిర్ణయాన్ని ఏపీ ఎందుకు అమలు చేయడం..?అని నారాయణ ప్రశ్నించారు.
Read Also: Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మాలివాల్‌కు అత్యాచార బెదిరింపులు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం లేదు. కందకు లేని దురద కత్తి పీటకన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున అవినీతికి వ్యతిరేకమన్నారు. విశాఖలో వైసీపీ నేతలే పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీ భూములు ఎలా ఆక్రమించుకుంటున్నారో విజయసాయి రెడ్డి చెప్పారు. విజయసాయి అక్రమాలను స్వయంగా వైసీపీ నేతలే వివరిస్తున్నారు. దేశంలో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానన్న జగన్.. వైసీపీ నేతల భూ కబ్జాలపై సమాధానం చెప్పాలి. రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం అన్నారు నారాయణ.
Read Also: Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మాలివాల్‌కు అత్యాచార బెదిరింపులు