విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు, దీని గురించి సీపీ మనీష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ… నగరంలో వాహనదారులు కు మాస్క్ లు ధరించడం అవగాహన కల్పిస్తున్నాం. మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసి చలానాలు విధించాం. అలా మార్చి 26 నుండి చేపట్టిన ఈ డ్రైవ్ లో 54,661 కేసులు నమోదు అయ్యాయి అని తెలిపారు. అలాగే నగరంలో కొత్తగా సీసీ కెమెరాలును అమర్చాం అని చెప్పిన ఆయన ఇకపై అవి ఆటోమేటిక్ గా ఫోటోలు తీసి చలానాలు విధిస్తాయి అని తెలిపారు. కాబట్టి ప్రతీ ఒక్కరు మాస్కు లు ధరించి బయటకు రావాలని కోరుకుంటున్నాము అని అన్నారు.