Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలో ఆర్భాటపు జీవితం, అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు బీటెక్ పూర్తి చేసిన 22 ఏళ్ల యువకుడు దొంగగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ వెటర్నరీ కాలనీలో భారీ చోరీకి పాల్పడిన నిందితుడు మరీదు వినోద్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ కుటుంబం తన పాప వైద్య చికిత్స నిమిత్తం సెప్టెంబర్ 4న చెన్నైకి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన నిందితుడు వినోద్ కుమార్, సెప్టెంబర్ 5న ఇంటి తాళాలు పగులగొట్టి ఏకంగా రూ. 40 లక్షల విలువైన బంగారాన్ని చోరీ చేశాడు. పోలీసుల దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి, సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు చొక్కా విప్పేసి, తన బైక్ నంబర్ ప్లేట్‌ను మార్చి ఈ నేరానికి పాల్పడ్డాడు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను డీసీపీ కృష్ణ కాంత్ పటేల్ వెల్లడిస్తూ, వినోద్ కుమార్ జాలీ లైఫ్ (లావిష్ లైఫ్) గడిపేందుకు అలవాటుపడి అప్పులు చేశాడని, ఆపై ఈఎంఐ (EMI)లు కట్టలేక దొంగతనాల బాట పట్టాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన రూ. 40 లక్షల విలువైన మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే అతడిని రిమాండ్‌కు తరలిస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు.
Also Read
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
తాజావార్తలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!