PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో ప్రతిఏటా రూ. 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల సొమ్మును అర్హులైన రైతుల ఖాతాలకు జమ చేశారు. చివరిసారిగా జూన్ నెలలో నగదు బదిలీ చేయగా, సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో నిధులు విడుదలవుతుంటాయి. తదుపరి 24వ విడత ఎప్పుడు వస్తుందనేదానిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో పడొచ్చని అంచనా. ఆ సమయంలో వరి కోతలు, గోధుమ, బంగాళాదుంప సాగు పనులు ప్రారంభమవుతాయి కాబట్టి ఇది రైతులకు ఎంతో ఆసరాగా ఉంటుంది.
కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రూరల్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంచుకుని, ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మీ రాష్ట్రం వివరాలతో పాటు అడిగిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలి. క్యాప్చా కోడ్ రాసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ని ఎంటర్ చేసి ధృవీకరించినట్లయితే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి ఆధార్ కార్డ్, భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, యాక్టివ్ బ్యాంక్ ఖాతా వివరాలు అవసరం అవుతాయి.
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
మీరు ఈ పథకానికి లబ్ధిదారుడో కాదో తెలుసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్లి ‘నో యువర్ స్టేటస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ కిసాన్ రిజిస్ట్రేషన్ వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని వెరిఫై చేస్తే మీ స్టేటస్ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవడం కూడా తప్పనిసరి. ఏదేమైనా.. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బును జమ చేస్తుంది. అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే పరిశీలిస్తుండటం మంచిది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!