రాష్ట్రంలో.. దేశంలో.. అంతెందుకు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత ఘటన చోటు చేసుకున్నా.. అది శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు ముందే చెప్పారని చెబుతుంటారు.. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విషయంలోనూ బ్రహ్మంగారు ముందే చెప్పారని ఆధారాలు చూపుతున్నారు.. కానీ, మరోవైపు బ్రహ్మంగారిమఠంలో మఠాధిపతి వ్యవహారం పెద్ద రచ్చగా మారడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది.. పలు దపాలుగా చర్చల తర్వాత ఇవాళ కొలిక్కి వచ్చింది మఠాధిపతి వ్యవహారం… దీంతో.. బ్రహ్మంగారిమఠం మఠాధిపతి ఎంపిక పూర్తి అయినట్టే…