నిజాయితీకి, పరిపాలనా దక్షతకు దామోదరం సంజీవయ్య నిదర్శనం అన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లక్డీ కాపూల్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ హనుమంతరావు సంజీవయ్యను గుర్తుచేశారు. ఈనాడు ఎంతోమంది డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు డబ్బులు సంపాదించడానికి రావద్దు ..సేవ చెయ్యడానికి రావాలన్నారు. నీతి నిజాయితీకి కలిగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. రెండు ప్రభుత్వాలు శత…