NTV Telugu Site icon

Chinta Mohan: 2024లో కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ.. వైసీపీ, బీజేపీ తుడిచిపెట్టుకుపోతాయి..!

Chinta Mohan

Chinta Mohan

2024లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయా పరిణామాలు మారబోతున్నాయి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్.. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలై ప్రస్తుతం మహారాష్ట్రలో సాగుతుందన్నారు.. చిన్నా భిన్నం అవుతున్న దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏకం చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీలో భారీ వర్షాలు..

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు చింతామోహన్‌.. వైసీపీ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి ద్రోహం చేస్తోందన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు.. 2024 ఎన్నికల్లో రాజకీయ ఎన్నికల యుద్ధం కాంగ్రెస్, టీడీపీ మధ్యే జరుగుతుందని పేర్కొన్నారు చింతామోహన్‌. కాగా, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. కన్యాకుమారిలో ప్రారంభమై కాశ్మీర్‌ వరకు సాగనుంది.. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ముగిసిన జోడో యాత్ర.. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోన్న విషయం విదితమే.. తాను చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని.. లక్షలాది మంది కదలివస్తున్నారని.. దేశాన్ని సమైక్యం చేసేందుకు భారత్‌ జోడో యాత్ర చేపట్టానని పలు వేదికలపై రాహుల్‌ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.