సామాజిక విప్లవానికి నిదర్శనమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. ఏపీ చరిత్రలో సామాజిక సమతుల్యత కోసం సీఎం వైఎస్ జగన్ ఈ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.. అంబేద్కర్ చరిత్ర ఈ నిర్మాణంలో తెలుస్తుందన్నారు. త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తాం అని వెల్లడించారు.
CM YS Jagan: విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్లు ఆ ప్రాజెక్టు పనులు జరుగుతోన్న తీరుపై సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి పైనా సమీక్ష చేశారు.. సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులపై చర్చించారు.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్‌కు వివరాలందించారు అధికారులు. స్మృతివనం…
విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విగ్రహం తయారీ, దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.. 81 అడుగుల విగ్రహ పీఠం, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుకు మొత్తంగా రూ.268 కోట్లు ఖర్చు చేస్తోంది.. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం..…