సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు.. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి బీచ్ వరకు 25వేల మందితో 25 కిలోమీటర్ల మెగా క్లీనప్ డ్రై వ్ లో పాల్గోనున్నారు. నగరానికి మణిహారమైన సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగింపును యజ్ఞంగా చేపట్టింది విశాఖ జిల్లా అధికార యంత్రాంగం.. 25వేల మంది భాగస్వామ్యంతో… 25కిలోమీటర్ల పొడవున మెగా బీచ్ క్లీనప్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నం గిన్నీస్ రికార్డ్ నెలకోల్పో దిశగా జరుగుతోంది. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు తీర ప్రాంతం పరిశుభ్రత కు చేస్తున్న ప్రయత్నంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. బీచ్ రోడ్ లో ఏ యూ కన్వెన్షన్ సెంటర్లో నదీ జలాల శుభ్రత సముద్ర తీర స్వచ్ఛతపై అమెరికాకు చెందిన పార్లే ఫర్ ఓషన్ సంస్థతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చు కోనుంది.
Read Also: Chandrababu Naidu: అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై దాడులా..? ఇదేం రాజకీయం..
దేశంలోనే తొలిసారిగా రీయుజ్డ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌ను ఈ ఎన్‌జీవో ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్ ను అడిడాస్ షూస్ తయారీకి వినియోగించనున్నట్టు పారిశ్రమల శాఖ చెబుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం ఏయూ కాన్వకేషన్ హాల్ కు చేరుకుంటారు. ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 1,60,000 మందికి ఐటీ శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందిన అభ్యర్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరగనుంది.. ఇక, సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు అమర్నాథ్, ఆది మూలం సురేష్ పరిశీలించారు. ఈ డ్రైవ్ లో రాజకీయాలకు అతీతంగా పార్టీలు పాల్గొనబోతున్నాయి.. ఈ పర్యటన కోసం.. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.. 10.20 గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహనా ఒప్పందం జరగనుంది.. సభను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.. అనంతరం సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు ఉదయం 11.23 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన విద్యార్ధులకు ధృవపత్రాలను అందించనున్నారు.. విద్యార్ధులతో ముఖాముఖి, అనంతరం సీఎం ప్రసంగం ఉండనుండగా.. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.