YSR Kalyanamasthu And YSR Shaadi Tohfa Schemesమరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించబోతోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్… వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధం అయ్యింది.. ఇవాళ బటన్ నొక్కి ఆ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని.. అర్హత ఉన్న వివిధ వర్గాలకు చెందిన యువతులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.. అక్టోబర్ – డిసెంబర్ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఈ ఆర్ధిక సాయం అందిస్తున్నారు.
Read Also: Astrology : ఫిబ్రవరి 10, శుక్రవారం దినఫలాలు
వధూవరులు ఇద్దరికీ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని షరతు పెట్టింది ఏపీ సర్కార్.. పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా. లబ్ధిదారైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని నిర్ధేశించింది వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎస్సీలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం రూ. 1,00,000 సాయం, ఎస్సీలకు (కులాంతర వివాహం) చేసుకున్నవారికి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం రూ. 1,20,000 సాయం, ఎస్టీలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 1,00,000 సాయం, ఎస్టీలకు (కులాంతర వివాహం) చేసుకున్నవారికి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 1,20,000 సాయం, బీసీలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 50,000 సాయం, బీసీల్లో కులాంతర వివాహం చేసుకున్నవారికి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 75,000, మైనార్టీలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,00,000, విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నవారికి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద ఈ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 1,50,000, భవన, ఇతర నిర్మాణ కార్మికుల్లో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 40,000 సాయం అందించనున్నారు.. ప్రతి త్రైమాసికానికి ఒకసారి లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది.. వధూవరులు వివాహమైన 30 రోజుల లోపు తమ దగ్గర లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. సంబంధిత అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వివరాలను ధృవీకరించుకుని, ప్రతి ఏటా ఫిబ్రవరి, మే, ఆగష్టు, నవంబర్‌లలో ఆయా త్రైమాసికాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందిస్తుంది ఏపీ సర్కార్. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి.. లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు సీఎం వైఎస్ జగన్.