తిరుపతి పర్యటనకు సీఎం జగన్ బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి బయలుదేరారు సీఎం జగన్. అయితే ఈరోజు 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా కు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకనున్నారు ముఖ్యమంత్రి జగన్. అమిత్ షాతో కలిసి శ్రీ వారిని దర్శించుకుని రాత్రికి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. అయితే హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో దేని పై చర్చించనున్నారు… ఏ నిర్ణయాలు తీసుకోనున్నారు అనేదాని పై రాజకీయ పరమైన చర్చలు బాగానే సాగుతున్నాయి.