CM Jagan: కోర్టు కేసుల వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్లపట్టాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30.70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని వెల్లడించారు. గజం 12 వేలికే చోట రూ.6 లక్షలు విలువైన ఇళ్లస్థలాన్ని పేదలకు ఇచ్చామని తెలిపారు. ఇంటి నిర్మాణం, మౌలిక సదుపాయాలతో కలిపి రూ.10 లక్షల వరకు ఆస్తిని ప్రతి అక్కాచెల్లెమ్మ చేతిలో పెట్టామని సీఎం జగన్ వివరించారు.
16 నెలల కిందటే ఇక్కడ ఇళ్లపట్టాలు ఇవ్వాలని అనుకున్నామని.. అయితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొందరు కడుపు మంట ఎక్కువైపోయి కోర్టులో కేసులు వేశారని జగన్ ఆరోపించారు. ఈ కేసులు ఎలా తొలుగుతాయోనని ప్రతిరోజు తాను ఆలోచించేవాడినని తెలిపారు. ఇన్ని లక్షలమందికి మేలు చేస్తున్న కార్యక్రమాలను కొంతమంది అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టు కేసుల వల్ల 489 రోజులు ఇక్కడ ఇళ్లపట్టాలు ఇవ్వడం ఆలస్యమైందని వివరించారు. అయితే దేవుడి దయ వల్ల కోర్టుల్లో కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. పిల్లలకు ఇంటి రూపంలో ఒక ఆస్తిని ఇవ్వాలనుకుంటారని.. ఒక ఇల్లు ఉండడం అనేది అక్కచెల్లెమ్మకు సామాజిక హోదా ఇచ్చినట్టు అవుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీలో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని.. ఇళ్లు లేని వాళ్లు ఎవరైనా సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే, స్థలం ఇస్తామని జగన్ ప్రకటించారు.
Also Read
- Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?