భర్తను కోల్పోయిన మహిళకు రాష్ట్ర సచివాలయ వ్యవస్థలోనే తొలి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించి ప్రజల పట్ల ప్రభుత్వానికున్న కమిట్మెంట్ ను మరోసారి చాటుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర సచివాలయ వ్యవస్థలోనే మొట్ట మొదటి సారిగా కారుణ్య నియామకం కింద రామకుప్పం మహిళ ఉద్యోగ అవకాశం దక్కించుకున్నారు వసంత భాయ్. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గం, రామకుప్పం ప్రాంతానికి చెందిన మోహన్ నాయక్….భూమన కరుణాకర రెడ్డి సొంత నియోజకవర్గమైన తిరుపతి, జీవకోన ప్రాంత సచివాలయంలో ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందారు. దీంతో మోహన్ నాయక్ భార్య వసంత భాయ్ కుంగిపొయారు. ఊరుకాని ఊరులో తన భర్తను పోగొట్టుకున్న బాధతో కన్నీరు మున్నీరయ్యేలా విలపించారు.
Read Also: Super Star: కృష్ణను పట్టించుకోని వారి గురించి ఏం అనుకోవాలి!?
భర్త లేకపోవడం, ఉద్యోగం రాకపోవడంతో ఆమె కుటుంబ పోషణ భారంగా మారింది. తన బాధను ఎవరికి చెప్పుకొవాలో దిక్కు తోచనిస్థితి ఆమెది. ఇలా ఇబ్బంది పడుతున్న తరుణంలోనే తాను నివాసం ఉంటున్న జీవకోన వద్ద గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని కలిసి తన కష్టాన్ని చెప్పుకున్నారు. తమ ఇంటి వద్దకే విచ్చేసిన భూమన కరుణాకర రెడ్డికి తన కష్టాన్ని వివరించారు. తనకు సహాయం చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు చలించి పోయిన భూమన కరుణాకర రెడ్డి వెంటనే స్పందించి అనంతపురం రీజియన్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టెర్ తో ఫొన్లో మాట్లాడారు.
మీకు వేల వేల ధన్యవాదాలు.. వసంత భాయ్
వసంతభాయ్ కి ఉద్యోగం వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇందుకు సంబంధించిన ఫైళ్లను సిద్దం చేయాల్సిందిగా నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలికి ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడంతో వసంతా భాయ్ కి జీవకోన సచివాలయంలో అడ్మిన్ ఉద్యోగం దక్కింది. అనతికాలం లోనే ఉద్యోగం రావడంతో వసంత ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ తనకు స్వాంతన చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అన్ని విధాలా సహాయం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి రుణపడి ఉంటామన్నారు.
తన భర్త చనిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ని కలిసి వివరించానని, ఆయన వెంటనే స్పందించి అనంతపురం రీజియన్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ తో మట్లాడి, తనకు ఉద్యోగం ఇప్పించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిని చాలా వేగంగా స్పందించారని, చక,చకా ఫైళ్లను సిద్దం చేశారన్నారు. రామకుప్పం నివాసి అయిన తనకు తిరుపతిలో ఉద్యోగం వస్తుందని ఊహించలేదన్నారు. ముత్యాల రెడ్డి పల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న భూమన కరుణాకర రెడ్డిని, నగర మేయర్ శిరీష ను దుశ్శాలువలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు వసంత భాయ్.
Read Also: Anantapur Arts College: అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో దారుణం.. లెక్చరర్ పై కత్తితో దాడి