CM Jagan : మన తలరాతను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని సీఎం జగన్ అన్నారు. నేడు సీఎం జగన్ 10.85 లక్షల మంది పిల్లలకు విద్యాదీవెన ద్వారా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువులు అన్నవి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తులు అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని ఆస్తి అని, మన తలరాతను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బలంగా నేను నమ్ముతా.. నాన్నగారి హయాంలో పూర్తి ధ్యాసపెట్టారు, పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అందింది.. ఆ తర్వాత దీన్ని ఒక్కరు కూడా అమలు చేయలేదు.. చక్కటి మార్పులు చేసి, చదువుల విప్లవాన్ని తీసుకు వచ్చామని ఆయన వెల్లడించారు. తండ్రి ఒక అడుగు వేస్తే, జగన్ నాలుగు అడుగులు వేస్తున్నాడు.. చదువుల విప్లవాన్ని దెబ్బతీయడానికి గతంలో ప్రభుత్వాలు చాలా చేశాయి.
పిల్లలను చదివించుకోలేని, ఫీజులు కట్టకోలేకపోతున్న తల్లిదండ్రుల క్షోభను నేను కళ్లారా చూశానన్నారు. ఫీజులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలైన ఘటనలు చూశానని, ఇలాంటి కష్టాలు చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశానన్నారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్ వరుసగా మూడేళ్లపాటు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ప్రతి త్రైమాసికానికి చెల్లిస్తున్నామని, తల్లుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు. జనవరి – మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బులు వేస్తున్నామని, 10.85లక్షల విద్యార్థులకు 9.75 లక్షల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
- Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా...
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!