వెలుగు జిలుగుల పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రి జగన్ దీపావళి శుభాకాంక్షలు అన్నారు జగన్. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ శుభాభినందనలు తెలిపారు జగన్.
ఇటు విపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లో వున్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగించినట్టే జీవితంలో కష్టమనే చీకటిని పారద్రోలడానికి ధైర్యమనే దీపాన్ని, కృషి అనే నూనెతో వెలిగించాలి. సమాజంలోని చెడు అనే చీకటిని పోగొట్టడానికి మంచి అనే దీపాన్ని ఒకరికొకరు వెలిగించుకుంటూ పోవాలి. ఇదే దీపావళి సారాంశం అని ట్వీట్ చేశారు చంద్రబాబు. దీపావళి పండుగ వేళ మీ ఇంట ఆనందకాంతులు వెల్లివిరియాలని, మీ కుటుంబానికి సకల శుభాలు సమకూరాలని కోరుకుంటూ.. మీ ఇంటిల్లిపాదికీ పండుగ శుభాకాంక్షలు.