Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశానికి ఆరుగురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ( డిసెంబర్ 11న) ఉదయం 10.30 గంటలకే మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది.. ఇకపై కేబినెట్ కు ఎవరైనా ముందుగానే రావాలి.. ఆలస్యంగా రావొద్దని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. ఫైల్ క్లియరెన్స్లో జాప్యంపై సీఎం సీరియస్
ఇక, నిన్న (డిసెంబర్ 10న) నేను హెచ్ఓడీల సమావేశానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను.. అక్కడ ఉన్న అందరికీ క్షమాపణలు కూడా చెప్పాను అని సీఎం చంద్రబాబు అన్నారు. నా తప్పును సరిదిద్దుకున్నాను.. మీరు కూడా ( ఆలస్యంగా వచ్చిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఆనం రామనాయరణరెడ్డి, వాసంశెట్టి సుభాష్) సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
