AP Assembly: ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల
- ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల
- శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై శ్రద్ధపెట్టామని, టీడీపీ హయాంలోనే నేరాలు కట్టడి చేశామని ఆయన వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో శాంతి భద్రతలకు చర్యలు తీసుకున్నామన్నారు. 2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందని ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారన్నారు. తమ మాట వినని పోలీసులను వెకెన్సీ రిజర్వ్‌కు గత ప్రభుత్వం పంపించిందని.. ఐదేళ్లూ వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులూ ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తన మీద చిన్నప్పటి నుంచి ఒక్క కేసు కూడా లేదని.. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని చెప్పారు. పవన్ రోడ్ మీద పడుకుని నిరసన తెలియచేసే పరిస్థితి కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారని.. లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారని.. ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Minister Atchannaidu: ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తాం..
Also Read
ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారని.. స్పీకర్ అయ్యన్నపై కేసులు పెట్టారని.. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ అవమానంతోనే కోడెల ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. ప్రస్తుత హోం మంత్రి అనిత మీద, కొందరు ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పారు. అయ్యన్న మీద అత్యాచారం చేయబోయారనే కేసు పెట్టడం సిగ్గు చేటన్నారు. పైల్స్ ఆపరేషన్ చేయించకుని రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నని 600 కిలో మీటర్లు తిప్పారని మండిపడ్డారు. రఘురామకృష్ణం రాజును జైల్లో పెట్టి కొడుతుంటే.. ఆనాటి సీఎం ఫోన్లో చూసి ఆనందించారని ఆగ్రహించారు. రఘు రామకృష్ణం రాజును తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. ప్రధాని తన నియోజకవర్గానికి వచ్చినా రఘురామ వెళ్లలేకపోయారని వాపోయారు. తాను అమరావతి పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారన్న సీఎం చంద్రబాబు.. అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛ అని నాటి డీజీపీ కామెంట్ చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!