Thomas: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలంలో 395 మహిళా సంఘాలకు 61 కోటి 95 లక్షల నిధుల చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.. 40 సంవత్సరాలుగా ప్రభుత్వ డబ్బులు తిని పంది కుక్కలాగా బతికే బతుకు మాది కాదు.. ఒక్కరోజు బతికినా నీతిగా నిజాయితీగా బ్రతుకుతాం.. నేను ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలల్లో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంటే.. నాపైన సీబీఐ ఎంక్వయిరీ వేయాలని నారాయణస్వామి అంటున్నాడు.. ఒరేయ్ పనికిమాలినోడ నీ పైన సీబీఐ ఎంక్వయిరీ వేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
Read Also: Extra-Marital Affairs: వివాహేతర సంబంధానికి అడ్డుగా రెండేళ్ల కూతురు.. కసాయి తల్లి ఏం చేసిందంటే..?
ఇక, నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది.. నీ పైన సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి అని డిమాండ్ చేశారు థామస్.. లిక్కర్ స్కామ్ లో దొబ్బేసింది నువ్వు.. దీనిపైన మాట్లాడడం టైం వేస్ట్ గా ఉంది.. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి.. అందరూ సమిష్టిగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించాలని తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామి ఏమి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.. నేను ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలలోనే ఎస్ఆర్ పురం మండలంలో ఏపీఐఎస్సీ ద్వారా మూడు పరిశ్రమలు ప్రతినిధులతో మాట్లాడి పరిశ్రమల ఏర్పాటుకు నేను కృషి చేస్తుంటే.. దానినే ఈ పనికిమాలిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాడు.. మూడు పరిశ్రమలకు సుమారు 2000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు వస్తున్నాయి.. దీనిని నారాయణస్వామి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. మన నియోజకవర్గంలో ఉన్న పేదలు పేదరికంగానే ఉండిపోవాలా? అని నారాయణస్వామిపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మండిపడ్డారు.. నారాయణస్వామి నువ్వు ఎక్సైజ్ శాఖలో మంత్రిగా పనిచేసినప్పుడు సుమారు 3500 కోట్లు అవినీతి జరిగింని ఆరోపించిన ఆయన.. సిట్ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు నాకేమీ తెలియదు అంటూ సిట్ అధికారుల కాళ్లపై పడ్డావు అంటూ విమర్శించారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్..
