RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: మరోసారి కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. రౌడీయిజం, గుండాయిజంతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘం (ఈసీ), న్యాయస్థానాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రెండేళ్ల పాలనలో ఏమీ చేయలేదనే భయంతోనే అధికార పక్షం దాడులకు దిగుతోందని విమర్శించారు.
నగరిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని రోజా ఆరోపించారు. ముగ్గురు చైర్మన్ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినప్పటికీ, వారిని ఏకగ్రీవంగా ప్రకటించారని తెలిపారు. కేజే కుమార్ కోడలు పోటీ చేస్తున్న వార్డులో ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని పేర్కొన్నారు. నామినేషన్ వేయకుండా అడ్డుకునే క్రమంలో ఓ అభ్యర్థి బంధువుపై దాడి చేసి గాయపరిచారని, పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపించారు.
Also Read
- AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
నామినేషన్ల పరిశీలన సమయంలో ఆమోదించిన, తిరస్కరించిన నామినేషన్ల వివరాలను స్పష్టంగా వెల్లడించలేదని రోజా అన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్‌ను తొలుత ఆమోదించిన తర్వాత తిరస్కరించారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఫామ్-7 స్లిప్ ఇచ్చిన అనంతరం టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచినట్లు బోర్డులు ఎలా పెడతారని నిలదీశారు. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి గెలుస్తారనే భయంతోనే అక్రమ ఏకగ్రీవాలకు పాల్పడ్డారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని, కౌన్సిలర్ అభ్యర్థులు లేక కూటమి నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
‘కర్మ ఈజ్ రిటర్న్’
నగరిలో జరిగిన ఎన్నికల అక్రమాలపై తాము హౌస్ మోషన్ మూవ్ చేశామని రోజా వెల్లడించారు. కోర్టులో న్యాయం జరుగుతుందని, నగరి మున్సిపాలిటీలో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆరోపణలు చేసినట్లుగానే, ఇప్పుడు నామినేషన్ల పరిశీలనలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో తప్పు చేసిన అధికారుల వివరాలను సేకరిస్తున్నామని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులు, కూటమి నేతలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎంపీలు అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, గురుమూర్తిపై దాడులు చేయడం దారుణం అన్నారు. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌కు నిజంగా దమ్ముంటే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. కూటమి అరాచకాలకు ప్రజలు, భగవంతుడు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. చంగారెడ్డికి, తనకు జరిగినట్లుగానే భానుకు కూడా వెన్నుపోటు తప్పదని అన్నారు. ‘కర్మ ఈజ్ రిటర్న్’ అంటూ, చేసిన తప్పులకు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లా కలెక్టర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై రోజా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన తనకు నిన్న సాయంత్రం, అలాగే ఈరోజు కలెక్టర్‌ను కలిసేందుకు సమయం కోరినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా దాటవేస్తున్నారని మనస్తాపం వ్యక్తం చేశారు. కలెక్టర్ వ్యవహారశైలితో పాటు కూటమి ప్రభుత్వ తీరుపైనా మీడియా చిట్‌చాట్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సూపర్ సిక్స్’ పథకాలు, ‘సూపర్ ప్రభుత్వం’ అంటూ గొప్పలు చెప్పుకునే కూటమి నాయకులు బ్యాలెట్ పేపర్‌తో జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పుకుంటున్న నాయకులు స్వేచ్ఛాయుత ఎన్నికలను ఎదుర్కోవడానికి వెనుకాడటం ఏమిటని నిలదీశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని, ఈసీ, కోర్టులు జోక్యం చేసుకుని నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!