CM Chandrababu: కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ – నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంకు వెళ్లి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇప్పటికే కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఈ రోజు ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు..
Read Also: Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?
కుప్పం బ్రాంచి కాల్వలో కృష్ణాజలాలు బిరబిరా ప్రవహిస్తున్నాయి. హంద్రీనీవా కాల్వకు కొత్త కళ తెచ్చింది. శాంతిపురం మండలంలోని పరమసముద్రం చెరువు కృష్ణాజలాలతో తొణికసలాడుతోంది. కృష్ణా జలాలకు హారతి, సారె సమర్పించడానికి రెండు రోజుల పర్యటన కోసం సీఎం చంద్రబాబు సతీసమేతంగా కుప్పం చేరుకున్నారు.. నేడు పరమసముద్రం చెరువు వద్ద జలహారతి ఇస్తారు. ఈ చెరువు నుంచి కుప్పం, పలమనేరులోని 110 చెరువులను అనుసంధానం చేయడానికి మార్గం ఏర్పడిందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం సమీపంలో కాల్వ వద్ద ప్రత్యేకంగా ఘాట్ ఏర్పాటుచేశారు. దీనికి దగ్గరలోనే 18 అడుగుల చిరస్మరణీయ జ్ఞాపకంగా పైలాన్ నిర్మించారు. కాల్వలో నీటి లోతు పరిశీలించడం, పరిసర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాయలసీమ వరప్రసాదినిగా భావించే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వకు నంద్యాల సమీపంలోని మల్యాల ఎత్తిపోతల వద్ద జులై 17న కృష్ణా జలాలను విడుదల చేశారు. ఆగస్టు 23న కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం వరికుప్పం వద్దకు కృష్ణాజలాలు చేరాయి. చివరి మజిలీగా పరమసముద్రంలోకి 25వ తేదీ చేరాయి. ప్రస్తుతం ఈ చెరువులు కృష్ణా జలాలతో కళకళలాడుతున్నాయి. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చే సమయానికి హంద్రీనీవా కాల్వ వెంబడి నియోజకవర్గంలోని 25 ప్రదేశాల్లో రైతులతో పూజలు చేయించడానికి కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఈ ఏడాది రూ.3,850 కోట్లు వెచ్చించి కృష్ణాజలాలను కుప్పం నియోజకవర్గానికి తెచ్చేందుకు వెచ్చించారు. 110 చెరువులను అనుసంధానం చేసి, 6,400 ఎకరాల ఆయకట్టుకు, నాలుగు మండలాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగించనున్నారు.
Read Also: Russia: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి
సరిగ్గా వారం రోజుల క్రితమే కృష్ణాజిల్లాలో కుప్పం నియోజకవర్గంలో అడుగుపెట్టాయి. నియోజకవర్గంలోని రామకుప్పం వద్ద కాలువలోకి చేరుకున్న నీళ్లను చూసి స్థానికులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. స్థానికులు, టిడిపి నేతలు హంద్రీనీవా కాలువలో దిగి కృష్ణా నీటిని ముద్దాడారు. ఆ నీళ్లను తాకి పరవశించిపోయారు. దశాబ్దాల కల నెరవేర్చిన చంద్రబాబు నాయుడు కు కుప్పం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనందంలో పాలుపంచుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే హోదాలో స్వయంగా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంకు చేరుకున్నారు.. కుప్పం మండలం పరమసముద్రం వద్ద నిర్మించిన హంద్రీ నీవా కాలువ వద్ద కృష్ణా జిల్లాలకు స్వాగతం పలకనున్నారు. ఇక్కడే సీఎం చేతుల మీదుగా గంగా హారతులు నిర్వహిస్తారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక్కడ దగ్గరలో ఏర్పాటు చేయడం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. కుప్పం వరకు కృష్ణమ్మ ను తీసుకువస్తానని కొన్ని ఏళ్ళ క్రిందట చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానం నెరవేరింది.
Read Also: Land Grabbing Mafia: హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న కబ్జారాయుళ్లు.. మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు!
కాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల చిరకాల స్వప్నం హంద్రీ- నీవా ప్రాజెక్టు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ లో భాగమైన కుప్పం బ్రాంచి కాలువ ద్వారా కృష్ణా నదీ జలాలు కుప్పం వరకు తీసుకురావాలన్నది లక్ష్యం. పలు సమస్యలను దాటుకుంటూ నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో సాగిన పనులు ఎట్టకేలకు పూర్తి అయ్యి నీళ్ళు కుప్పానికి చేరుకున్న కృష్ణా జలాలకు నేడు జల హారతి ఇవ్వనున్నారు సీఎం. ఉదయం 10 గంటలకు స్వగృహం నుంచి సతీమణి భువనేశ్వరితో కలిసి బస్సులో బయల్దేరి రోడ్డు మార్గంలో కుప్పం మండలం హంద్రీనీవా కాల్వ పరమసముద్రం గ్రామానికి 10.30 గంటలకు చేరుకుంటారు. 10.30 నుంచి 11.15 వరకూ ‘జలహారతి’ సమర్పిస్తారు. పక్కనే అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుని, బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పారిశ్రామికవేత్తలు, ఇతర విశిష్టులతో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రోడ్డు మార్గంలో బహిరంగసభనుంచి పరమసముద్రం గ్రామంలోని హెలిప్యాడ్ వద్దకు 3.55కు చేరుకుని బెంగుళూరుకు 4.40 గంటలకు చేరుకుంటారు. అక్కడనుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు సీఎం.. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ రెండు రోజుల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇక వీటితోపాటు
అల్యూమినియం తయారీ రంగంలో దిగ్గజ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ ట్రూజన్ ప్లాంట్ను కుప్పంలో ఏర్పాటుచేస్తోంది. దీని ద్వారా అల్యూమినియం ఉత్పత్తులే కాకుండా. ఐఫోన్ బాడీలనూ తయారుచేయనుంది. ఈ పరిశ్రమతో యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో మన రాష్ట్రం భాగస్వామి కానుంది. దీనిద్వారా 613 ఉద్యోగాలు లభిస్తాయి. మేక్ ఇన్ ఇండియా… మేక్ ఫర్ ది వరల్డ్ లాంటి కేంద్ర లక్ష్యాలకు అనుగు ణంగా, కీలకమైన విడిభాగాలను ఉత్పత్తి చేసే దిశగా ఐఫోన్ విడిభాగాలు ఇప్పుడు దేశంలోనే తయారుకానున్నాయి. భవిష్య త్తులో కుప్పం మరిన్ని టెక్ పెట్టుబడులకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఎంవోయులు కూడా ఈ రోజు జరగనున్నాయి.
