కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ అడుగుపెట్టింది. హంద్రీ - నీవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ గుండా కృష్ణా జిల్లాలు కుప్పంలో అడుగుపెట్టాయి. పరమ సముద్రం అనే గ్రామం వద్ద నుంచి కృష్ణా జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పంకు వెళ్లి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు హారతులు పట్టి స్వాగతం పలకనున్నారు. తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు…