Chinta Mohan: సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర..! కేంద్ర మాజీ మంత్రి సంచలన ఆరోపణలు..
- సీతారాం ఏచూరి మృతిపై చింతా మోహన్ సంచలన ఆరోపణలు..
- ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది...
- ఏచూరి మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించిన చింతా మోహన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు.. ఒక స్వైన్ ఫ్లూ కేసు రోగి పక్కన సీతారాం ఏచూరి ఉంచారు.. దానివల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.. ఇక, ఏచూరికి మెరుగైన వైద్యం అందించకుండా కూడా బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు చింతా మోహన్..
Read Also: Bihar : మల విసర్జన చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళను ఢీకొట్టిన రైలు
Also Read
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..
మోవైపు.. వైఎస్ జగన్ మాటలు మానవత్వం గురించి మాట్లాడడం విడ్డూరం అన్నారు చింతా మోహన్.. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొట్టించడం మానవత్వమా?.. ఇదేనా ప్రేమ..? అని ప్రశ్నించారు.. సెక్యులరిజం అంటే నిన్నటి వరకు బీజేపీతో కలిసి నాట్యం చేసి మాట్లాడడం ఏంటి? అని ఎద్దేవా చేశారు.. దళితులపై ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతున్నారు.. కానీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు మూసేసావు.. స్కాలర్షిప్ లు ఎందుకు ఆపేశావు అని నిలదీశారు.. ఇక, వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తే ఏమి..? ఎడమ చేతితో సంతకం చేయి.. ఎంతో మంది సంతకాలు పెట్టి పోయారని వ్యాఖ్యానించారు.. ఇప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంలో సైలెంట్ ఉండు అంటూ వైఎస్ జగన్‌కు సలహా ఇచ్చారు.. నీకు ఉన్న కొంచెం పరువు కూడా తీసేశారని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కాగా, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి.. ఈ నెల 12వ తేదీన కన్నుమూసిన విషం విదితమే.. ఆయన వయసు 72 ఏళ్లు. కొద్దిరోజులుగా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడిన ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.. అయితే, చింతామోహన్ ఇప్పుడు ఆయన మృతిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!