Site icon NTV Telugu

Atrocious: ఏపీలో దారుణం.. రెండు నెలలుగా బాలికపై వృద్ధుడు అత్యాచారం..

Ap Rape

Ap Rape

దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.

Read Also: Group 2: ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు ఊరట.. దరఖాస్తు గడువు పొడిగింపు

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నక్కనపల్లి గ్రామంలో మైనర్ బాలిక పై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 2 నెలలుగా ఆ బాలిక పై వృద్ధుడు సంపగి రెడ్డి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా కుటుంబసభ్యులకు తెలియడంతో బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడు సంపంగి రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాళ్లబుదుగూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Article 370: ‘‘ఆర్టికల్ 370ని తీసేయలేరు’’.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్..

Exit mobile version