స్మశానవాటికలో హెల్త్ క్లినిక్… టీడీపీ నేతల వరుస అరెస్టులు

అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టపర్తిలోని స్మశానవాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించాలంటూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైసీపీ సర్కారు నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. స్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సమాధులు తవ్వేసి చదును చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read Also: తగ్గేదేలే అంటున్న ఒమిక్రాన్… దేశంలో 3వేలు దాటిన కేసులు

ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో బంద్‌ నిర్వహించాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నేతలు పుట్టపర్తి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అమరావతి నుంచి పుట్టపర్తి వెళ్తున్న టీడీపీ సీనియర్ నేతలు పల్లె రఘునాథ్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులను బుక్కరాయసముద్రంలో పోలీసులు అరెస్ట్ చేసి ఇళ్లకు తరలించి గృహనిర్బంధం చేశారు. ఏపీలో స్మశానాలను కూడా వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పుట్టపర్తిలో స్మశానవాటికలో హెల్త్ క్లినిక్ నిర్మాణం పట్ల బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు.

Related Articles

Latest Articles