YS Jagan: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు, ఆయన ఇరిగేషన్ మంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది.. వీళ్లను చూస్తే రాక్షసులను తలపించేలా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఏకంగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మాటలు రైతన్నలకు విలన్ లాగా కనిపిస్తున్నారు.. క్లోజ్డ్ మీటింగ్ లో నేను ఒత్తిడి తెచ్చి పనులు ఆపించాను అనే దానికి రేవంత్ రెడ్డి మాటలు సాక్ష్యాలు అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఖండిస్తారని అందరూ భావించారు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని వీళ్లు బరితెగించి మాట్లాడిన మాటలు వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్లేనని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also: TOXIC : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
ఇక, తన స్వార్ధం కోసం పిల్లను ఇచ్చిన మామని, జన్మనిచ్చిన సీమకు కూడా సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఒక గొప్ప ఉద్దేశ్యంతో ప్రారంభించాం.. తాగటానికి మంచి నీళ్లు కూడా దొరకని ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది.. రాయలసీమ, నెల్లూరు, చెన్నై ప్రాంతాలకు కూడా సంజీవని లాంటిది అని తెలిపారు. అందరికీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వాస్తవాలు తెలియాలి అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారు.. స్వార్థ రాజకీయల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరు అని వైఎస్ జగన్ మండిపడ్డారు.