The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Revolutionaries OTT: భారత స్వాతంత్ర్య పోరాటం గురించి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చినప్పటికీ.. చరిత్రలో అంతగా వెలుగులోకి రాని విప్లవకారుల కథలు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటి అరుదైన కథతో ఇప్పుడు ‘ది రివల్యూషనరీస్’ (The Revolutionaries) అనే భారీ హిస్టారికల్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఆఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. మరి ఈ హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుంది ? ఏ ఓటీటీలోకి వస్తోంది ? దీని కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘ది రివల్యూషనరీస్’ 2026 సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ప్రైమ్ వీడియో, ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు డిజిటల్ ప్రీమియర్ తేదీని కూడా వెల్లడించింది. చరిత్రలోని రియల్ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ సిరీస్ స్వాతంత్ర్య ఉద్యమంలోని చెప్పని కథలను కొత్త తరానికి పరిచయం చేయబోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ రచయిత సంజీవ్ సన్యాల్ రచించిన బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రివల్యూషనరీస్: ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా వన్ ఇట్స్ ఫ్రీడమ్’ ఆధారంగా తెరకెక్కింది.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న నలుగురు విప్లవకారుల జీవితాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. చరిత్ర పుస్తకాలలో పరిమితంగా ప్రస్తావించబడిన ఈ పాత్రలను ఇప్పుడు మరింత విస్తృతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. సిరీస్‌లో భువన్ బామ్ రాష్ బిహారీ బోస్ పాత్రలో కనిపించనుండగా, రోహిత్ సరఫ్ సచింద్ర నాథ్ సన్యాల్‌గా నటిస్తున్నారు. ఎమ్మే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ సిరీస్‌లో రాష్ బిహారీ బోస్ (భువన్ బామ్), సచింద్ర నాథ్ సన్యాల్ (రోహిత్ సరఫ్), ప్రతిభా లాహిరి (ప్రతిభా రాంటా) మరియు బాఘా జతిన్ (గుర్ఫతే పిర్జాదా) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురు పాత్రల చుట్టూనే కథ ముందుకు సాగుతుంది.
కథ ఏమిటంటే ?
1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ వైఫల్యం తర్వాత బ్రిటీష్ క్రూర వలస పాలనను అంతం చేయడానికి ఈ నలుగురు యువకులు సాయుధ ప్రతిఘటన బాట పడతారు. వీరు దాదాపు 15 వేల మంది విప్లవకారులను ఏకం చేసి, బ్రిటీష్ రాజ్‌పై దేశంలోనే అతిపెద్ద సాయుధ దాడికి వ్యూహం రచిస్తారు. కేవలం చారిత్రక సంఘటనలనే కాకుండా, ఆ నాటి విప్లవకారుల మధ్య ఉన్న బలమైన స్నేహం, అచంచలమైన దేశభక్తి మరియు వారు ఎదుర్కొన్న అంతర్గత ద్రోహాలను ఈ సిరీస్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఆవిష్కరించనుంది.
ఇటీవల ఓటీటీ వేదికల్లో హిస్టారికల్ కథలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘ది రివల్యూషనరీస్’పై అంచనాలు మరింత పెరిగాయి. చరిత్రలో మరుగునపడిన వీరుల పోరాటాన్ని ఈ కాలం ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో, దేశభక్తి కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మరో ఆసక్తికరమైన ఓటీటీ కంటెంట్ గా మారబోతోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
-
Homemade Malai: పాల మీగడ మందంగా రావట్లేదా? ఈ 4 సింపుల్ టిప్స్ పాటిస్తే గిన్నె నిండా మీగడ పక్కా!
-
India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
ట్రెండింగ్
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి