AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 24.15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎన్నికల హామీని అమలు చేయాలంటే రిజర్వేషన్లను దాదాపు 10 శాతం పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికపై కేబినెట్ నిర్ణయం కీలకంగా మారింది.
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికి సంబంధించిన బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొస్తోంది. దీంతో పాటు మరికొన్ని కీలక బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు వంటి కీలక అంశాలు నేటి కేబినెట్ భేటీలో ప్రధానంగా నిలవనున్నాయి.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!