ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన రాజధాని పనులను మే 2, 2025న తాము తిరిగి ప్రారంభించామని, ఒక నగరానికి పునాది వేసి, పనులు ఆగిపోయిన తర్వాత మళ్లీ రీస్టార్ట్ చేయడం అనేది చరిత్రలో అమరావతిలోనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 2028 సంవత్సరం నాటికి రాజధానిలోని ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే వీటిని ఘనంగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు
రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పూర్తికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టమైన గడువులను వివరించారు. దీని ప్రకారం, అమరావతిలోని ప్రధానమైన ట్రంక్ రోడ్ల పనులన్నీ మే 27, 2027 నాటికి పూర్తవుతాయి. అలాగే, వివిధ లేఅవుట్ల నిర్మాణాన్ని మే 27, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అత్యంత కీలకమైన అసెంబ్లీ భవనం మే 28, 2028 నాటికి, హైకోర్టు నిర్మాణం జూన్ 20, 2028 నాటికి పూర్తి చేసి సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజధానికే తలమానికంగా నిలిచే ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం ఆగస్టు 4, 2028 నాటికి పూర్తవుతుందని, అదే నెలలో ప్రధానమంత్రి స్వయంగా విచ్చేసి వీటిని ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు.
PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..
పునాది వేయడం, పనులు ఆగిపోయాక మళ్లీ రీస్టార్ట్ చేయడం, చివరకు అదే నాయకుడు ప్రారంభోత్సవం చేయడం వంటి అరుదైన చరిత్రకు అమరావతి వేదిక కాబోతోందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారు 56,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 91 రకాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ క్షేత్రంలో రాత్రింబవళ్లు సుమారు 30,000 మంది కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారని, నిర్ణీత గడువులోగా ప్రపంచ స్థాయి రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
