Central Team: ఓ వైపు వరద.. మరోవైపు కేంద్ర బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో చాలా ప్రాంతాల్లో ముంపునకు గురయ్యాయి.. ఉన్న ఇల్లు, ఊరిని విడవాల్సి వచ్చింది.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వచ్చాయని భావిస్తోన్న తరుణంలో మరోసారి గోదావరి పోటెత్తుతోంది.. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఇదే సమయంలో.. జులై నెలలో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది కేంద్ర బృందం.. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాగనుంది.. గత నెలలో వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ, గృహ నష్టాలను పరిశీలించనుంది ఇంటర్ మినిస్ట్రీయల్ కేంద్ర బృందం. ఈ రోజు ఉదయం 9 గంటలకు రాజమండ్రి నుండి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా రావులపాలెం మండలం గోపాలపురం చేరుకోనున్న కేంద్ర బృందం .. గోపాలపురంలో ఏర్పాటు చేసిన ఉద్యాన వ్యవసాయ పంట నష్టాలపై చాయా చిత్ర ప్రదర్శనను, దెబ్బతిన్న ఉద్యాన వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది..
Read Also: Astrology : ఆగస్టు 11, గురువారం దినఫలాలు
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ఇక, పి.గన్నవరం మండలం నాగుల్లంక చేరుకుని స్థానికంగా దెబ్బతిన్న ఉద్యాన వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించనుంది కేంద్ర బృందం… రాజోలు మండలం మేకలపాలెంలో జలవనరుల శాఖ గోదావరి వరదల ఉధృతిని తెలిపే ఛాయా చిత్ర ప్రదర్శన తిలకించి, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనున్నారు.. అనంతరం దిండి రిసార్ట్స్ లో విశ్రాంతి తీసుకుని.. ఆ తర్వాత విజయవాడ బయల్దేరి వెళ్లనుంది కేంద్ర బృందం.. మరోవైపు.. గోదావరిలో క్రమంగా వరద ప్రభావం పెరుగుతోంది.. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 14 అడుగులకు చేరింది నీటిమట్టం.. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. బ్యారేట్ గేట్ల ద్వారా 13 లక్షల 19వేలు క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక, సహాయక చర్యల్లో మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం లో ఎన్డీఆర్ఎఫ్, అమలాపురం లో 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూనవరం లో ఎన్డీఆర్ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.. ఏలూరు జిల్లా, కుకునూర్ కు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తరలించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో పాశర్లపూడి అప్పనపల్లి కాజ్వే నీట మునిగింది.. మూడు గ్రామాలకు, అప్పనపల్లి , దొడ్డవరం, పెదపట్లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. సఖినేటిపల్లి మండలం అప్పన్న రామునీ లంక టేకీ శేట్టిపాలెం వంతెన నీట మునగడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఇక, వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ప్రజల సహాయార్థం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో 24 గంటలపాటు అధికారులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.. వరద సహాయం కోసం 8977935609 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈనెల 17 వరకు రెండు షిఫ్ట్ ల్లో సిబ్బందిని నియమించారు అధికారులు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!