ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZIM vs IND: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తొలి బంతికే వికెట్ తీసి టీమిండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు. బ్రయాన్ బెనెట్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బెన్ కర్రాన్ (10), డియోన్ మైయర్స్ (6), కెప్టెన్ సికిందర్ రజా (4) కూడా త్వరగానే ఔట్ కావడంతో జింబాబ్వే 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే ఆ తర్వాత వెస్లీ మద్వీర, ర్యాన్ బర్ల్, మరుమాని జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా వెస్లీ మద్వీర 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరుమాని 27 పరుగులతో నాటౌట్గా నిలవగా, ర్యాన్ బర్ల్ 26 పరుగులు చేశాడు. మద్వీర, మరుమాని ఆరో వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబె, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్లో భారత్కు రెండు పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉన్నారు.
Also Read
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!