ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విలయ తాండవం సృష్టించిన సంగతి తెల్సిందే. ఇప్పుడిప్పుడే ఆ మహామ్మారి బారి నుంచి బయటపడుతున్నాం. కానీ ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తుండటంతో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. పండుగల సమయంలో జాగ్రత్తలు పాటంచకుంటే భారీ ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ శనివారం రాష్ట్రాలకు లేఖ రాశారు.
రాబోయే పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. కంటైన్‌మెంట్ జోన్లు, 5శాతానికి మించి కరోనా కేసులు ఉన్న జిల్లాల్లో భారీ జనసముహాలు గుమికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
పండుగల వేళ నిర్వహంచే కార్యక్రమాల్లో పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించాలని, షాపింగ్ మాళ్లు, మార్కెట్లు, ప్రార్థన స్థలాల్లో పాటించాల్సిన నింబధనల గురించి గతేడాది నవంబర్30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌లపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది. ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫస్ట్‌డోస్ వ్యాక్సిన్ తీసుకొని సెకండ్ డో స్ తీసుకొని వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరింది.