భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు.. కోవిడ్ కేసులు కూడా అమాంతం పెరిగిపోయాయి.. గత వారం వరకు 7వేల లోపు నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. మళ్లీ పది వేలు దాటి 15 వేల వైపు పరుగులు పెడుతోంది… తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 268 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒమిక్రాన్ కేసులు కూడా వెయ్యికి…
భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ తరుణంలో రాష్ట్రాలకు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. గతంలో భారత్‌తో పాటు అనేక దేశాలను అతలాకుతం చేసిన కోవిడ్ డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తోందని తెలిపింది.. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్రం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విలయ తాండవం సృష్టించిన సంగతి తెల్సిందే. ఇప్పుడిప్పుడే ఆ మహామ్మారి బారి నుంచి బయటపడుతున్నాం. కానీ ప్రజలు నిర్లక్ష్యంగా వహిస్తుండటంతో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. పండుగల సమయంలో జాగ్రత్తలు పాటంచకుంటే భారీ ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ శనివారం రాష్ట్రాలకు లేఖ రాశారు. రాబోయే పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తుంది. కంటైన్‌మెంట్…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కలవరపెడుతూనే ఉంది.. కేసులు తగ్గుతున్నా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్.. బయటపడింది.. ఇప్పటికే భారత్‌లో ఆరు, ఏడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తొలి కేసు నమోదైంది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తిరుపతికి చెందిన బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా తేలింది.. పుణెలోని సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు…