LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
- LPG సబ్సిడీ కావాలంటే ఇది తప్పనిసరి
- అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Authentication for LPG Subsidy: దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు సబ్సిడీపై లభించే LPG సిలిండర్ రీఫిల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీ ధరకు LPG రీఫిల్ బుక్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ (BAA) తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
సబ్సిడీ ప్రయోజనం నిజమైన, అర్హత కలిగిన కుటుంబాలకు మాత్రమే అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ప్రతి LPG కనెక్షన్‌ను ఆధార్ ద్వారా ధృవీకరించిన వినియోగదారుతో అనుసంధానం చేయడం వల్ల సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. అలాగే డూప్లికేట్, అనర్హమైన LPG కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు ఇది సహాయపడుతుందని తెలిపింది.
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ఇప్పటికే ఆధార్ బయోమెట్రిక్ పూర్తి చేసిన వారికి మళ్లీ అవసరం లేదు
ఇప్పటికే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేసిన వినియోగదారులు మరోసారి చేయాల్సిన అవసరం లేదు. వారికి LPG రీఫిల్స్ ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు BAA పూర్తి చేయని వినియోగదారులకు మాత్రం ఆధార్ ఆథెంటికేషన్ పూర్తయిన తర్వాతే సబ్సిడీతో కూడిన నియంత్రిత రిటైల్ విక్రయ ధర (RSP) వద్ద రీఫిల్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ ఎలా పూర్తి చేయాలి?
వినియోగదారులకు BAA పూర్తి చేసేందుకు పలు సులభమైన మార్గాలను ప్రభుత్వం సూచించింది.
1. సిలిండర్ డెలివరీ సమయంలో
LPG సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి వద్ద ఉన్న OMC మొబైల్ అప్లికేషన్ ద్వారా అక్కడికక్కడే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
2. LPG డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లో
వినియోగదారులు తమ LPG డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ BAA ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
3. OMC మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే
సంబంధిత కంపెనీ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు స్వయంగా ఆథెంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
Indane: IndianOil ONE యాప్
Bharatgas: HelloBPCL యాప్
HP Gas: HP PAY యాప్
ఆధార్ ఆథెంటికేషన్ చేయకపోతే LPG దొరకదా?
ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేయడానికి ఆసక్తి లేని వినియోగదారులకు కూడా LPG సరఫరా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అయితే వారు తమ OMC డిజిటల్ ఛానళ్ల ద్వారా తమ ఎంపికను నమోదు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ ఎంపికను వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, WhatsApp చాట్‌బాట్, IVRS లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. అలాంటి వినియోగదారులకు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు LPG అందిస్తారు. స్థానికంగా అందుబాటును బట్టి 5 కిలోలు లేదా 10 కిలోల సిలిండర్లలో సరఫరా చేస్తారు.
గడువు పలుమార్లు పొడిగింపు
బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత జూన్ 30 వరకు గడువు విధించింది. ఆ తర్వాత గడువును పలుమార్లు పొడిగించింది. జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 7 వరకు పొడిగించి, చివరగా సెప్టెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ ఆధార్ ఆథెంటికేషన్ కార్యక్రమం 2023 అక్టోబర్ నుంచి కొనసాగుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటివరకు 12 కోట్లకు పైగా SMS, WhatsApp సందేశాలను పంపడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ సిబ్బంది, ప్రత్యేక క్యాంపులు, IVRS తదితర మార్గాల ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పించాయి.
LPG సబ్సిడీపై కేంద్రం భారీ ఆర్థిక మద్దతు
దేశీయ LPG ధరలను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందిస్తోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం, 14.2 కిలోల LPG సిలిండర్‌పై సెప్టెంబర్ 2026లో అంతర్గతంగా లెక్కించిన సబ్సిడీ సుమారు రూ.210గా ఉంది. జూన్ 2026లో ఇదే సబ్సిడీ సుమారు రూ.721గా ఉండేది.
తాజావార్తలు
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!