Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- నేటి రాశిఫలాలు ఇలా..
- ఆ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Horoscope: సూర్యోదయంతో ప్రారంభమయ్యే ప్రతి రోజూ మన జీవితంలో కొత్త అవకాశాలను, సరికొత్త సవాళ్లను తీసుకొస్తుంది. గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన దైనందిన ఆలోచనలు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. మరి అలాంటివి ఈ రోజు మీ రాశి చక్రంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఏయే రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే విఘ్నాలు తొలగి, కార్యసిద్ధి కలగడానికి ఏ రాశి వారు ఏ గణపతి రూపాన్ని ఆరాధించాలో తెలిపే సమగ్ర రాశిఫలాలు ఇక్కడ చూసేయండి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి మంచి అనుకూలతలు కలుగుతాయి. ఆస్తి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సంబంధిత విషయాల్లో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు నాట్య గణపతి స్వామిని పూజించి, నృత్య గణేశ అష్టకం పారాయణం చేయడం మంచిది.
Also Read
మిథున రాశి:
మిథున రాశి వారికి వ్యాపార రంగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా పోస్టల్ రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. శ్రీ రత్నగర్భ గణపతి స్వామిని పూజించి, రత్నగర్భ గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు వైద్యపరమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా కీలక దశకు చేరుకుంటారు. శ్రీ సాక్షి గణపతి స్వామిని పూజించి, గణపతి ద్వాదశ నామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
సింహ రాశి:
సింహ రాశి వారు వివిధ రకాల ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విజయ యాత్రల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. రాజకీయపరంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. అయితే షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శ్రీ బీజ గణపతి స్వామిని పూజించి, గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేయాలి.
కన్య రాశి:
కన్య రాశి వారికి కీలకమైన ఉద్యోగ కార్యక్రమాల కోసం సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. శ్రీ వాంఛా గణపతి స్వామిని పూజించి, గణేశ గీత పారాయణం చేయడం మంచిది.
తులా రాశి:
తులా రాశి వారు భవిష్యత్తులో నిర్వహించాల్సిన శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం ద్వారా మేలు జరుగుతుంది. కళాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉచ్చిష్ట గణపతి స్వామిని పూజించి, గణేశ హృదయం పారాయణం చేయడం మంచిది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి నిఘా వర్గాల్లో కీలకమైన ఆధారాలను సేకరించే అవకాశం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో భారీ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు అనుకూల సమయం కోసం ఎదురుచూస్తారు. కౌన్సిలింగ్ ద్వారా ఆందోళనలు, భయాలు తగ్గే అవకాశం ఉంది. రుణ విమోచన గణపతి స్వామిని పూజించి, రుణ విమోచన గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి మంచి గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్ని ఇస్తుంది. పరిశోధన రంగంలో ఉన్నవారు ప్రతిభను చాటుకునే అవకాశం ఉంది. కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐశ్వర్య గణపతి స్వామిని పూజించి, ఇంద్రకృత గణేశ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
మకర రాశి:
మకర రాశి వారు చర్చలు, పోరాటాల విషయంలో మంచి విజయాలను సాధించే అవకాశం ఉంది. గిరాకీ, ఉత్పత్తికి సంబంధించిన అంశాల్లో ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ పెద్దలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శించే అవకాశం ఉంటుంది. భక్త గణపతి స్వామిని పూజించి, గణేశ దివ్య దుర్గ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి పరిశోధన రంగంలో అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా ఖగోళశాస్త్రంపై అధ్యయనం చేసేవారికి అభివృద్ధితో కూడిన ప్రయోజనాలు లభిస్తాయి. కమ్యూనిటీ సంఘాల్లో చేరి ఇతరులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తారు. వివిధ రకాల హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుంది. శక్తి గణపతి స్వామిని పూజించి, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
మీన రాశి:
మీన రాశి వారు ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడారంగంలో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కష్టపడి పనిచేస్తూ పట్టుదలతో లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ద్విజ గణపతి స్వామిని పూజించి, గణేశ భుజంగ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
తాజావార్తలు
-
TGPSC కీలక నిర్ణయం.. AEE పరీక్షకు మరో అవకాశం
-
Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!