పబ్జీకి బానిసై అపస్మారక స్థితిలోకి బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగాక పిల్లలమీద ఒక కన్నేసి వుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు, వైద్యులు మొత్తుకుంటున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. లాక్ డౌన్‌తో ఇళ్లకే పరిమితం కావడంతో గేమ్స్ పిచ్చిలో పడి.. పిల్లలు ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ చేతిలో పట్టుకుని అదే మాయలో ఉంటున్నారు.అనంతపురం జిల్లాలో పబ్జీకి బానిసై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడో బాలుడు.
ఈ గేమ్‌కు బానిసైన ఓ విద్యార్థి.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన 13 ఏళ్ళ విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. మూడు నెలల నుంచి తన మొబైల్‌లో గేడ్ ఆడుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం సృహ తప్పి కిందపడిపోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తల్లిదండ్రులను కూడా అతను గుర్తు పట్టలేకపోతున్నాడు. నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడని తిరిగి కోలుకోవడానికి సమయం పడుతుందంటున్నారు డాక్టర్లు.
Also Read
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!