Bonda Uma: రోజా సొల్లు మాటలు మానుకోవాలి.. ఆమె అలాంటి సినిమాల్లో నటించలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్‌లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు ఉన్నాయని బోండా ఉమ వ్యాఖ్యానించారు. స్టేజ్ షోల్లో మాట్లాడినట్టు రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది.. ఇన్నాళ్లూ ఏం చేశారని నిలదీశారు. వనజాక్షి ఎపిసోడ్‌పై మళ్లీ విచారణ జరిపించాలని.. కాల్ మనీ సెక్స్ రాకెట్టును బయట పెట్టి కేసులు పెట్టిందే టీడీపీ ప్రభుత్వమన్నారు.
విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ అండగా ఉందని.. అందుకే తమకు నోటీసులు ఇచ్చారని బోండా ఉమా ఆరోపించారు. తనకు పవర్స్ ఉన్న చందంగా వాసిరెడ్డి పద్మ ఏదేవో మాట్లాడుతున్నారని.. మహిళా కమిషన్‌కు ఉన్న అధికారాలు వాసిరెడ్డి పద్మ చదివారా అని నిలదీశారు. అనర్హత కలిగిన వ్యక్తి మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారని బోండా ఉమ అన్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎస్, జాతీయ మహిళా కమిషన్‌ను కోరుతున్నామని బోండా ఉమ చెప్పారు. వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమో.. అది కుదరదన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లతో తమ వెంట్రుక కూడా ఊడదన్నారు. చట్టం వాసిరెడ్డి పద్మకే కాదు.. మాకూ చట్టం ఉందన్నారు. మహిళా కమిషన్ చర్యలను ఏ విధంగా ఎదుర్కొవాలో తమకు తెలుసన్నారు.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ఆడబిడ్డ జీవితం విషయంలో వాసిరెడ్డి పద్మ రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రాజకీయం చేయడానికి చాలా వేదికలున్నాయని.. రాజకీయ కోణంలోనే ఆలోచించే టీడీపీ నేతలకు వాసిరెడ్డి పద్మ నోటీసులిచ్చారని ఆమె ఆరోపించారు. తాము బాధితురాలితో కలిసి మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్తున్నామని.. వాసిరెడ్డి పద్మకు చిత్తశుద్ధి ఉంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని బాధితురాలి తల్లి ఆరోపించారు.
తాజావార్తలు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!