Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avengers Endgame Encore: మార్వెల్ కామిక్స్ సూపర్ హీరో టీమ్ ఆధారంగా మార్వెల్ స్టూడియస్ నిర్మించిన ఒక ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అవెంజర్స్: ఎండ్ గేమ్ (Avengers: Endgame). చాలా ఏళ్ళ తర్వాత ‘ఎండ్‌గేమ్ ఎన్కోర్’ పేరుతో థియేటర్లలోకి వచ్చిన ఈ మార్వెల్ సినిమా ఇండియాలో అద్భుతంగా సృష్టించింది. తాజాగా రీ-రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్యాక్నిల్క్ నివేదిక ప్రకారం.. ఈ సినిమా శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 7.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. మన దేశంలో కేవలం 3600 స్క్రీన్స్‌లో మాత్రమే విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషం. ముఖ్యంగా ఇంగ్లీష్ వెర్షన్‌కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎన్కోర్ వర్షన్లో మేకర్స్ జోడించిన నాలుగు నిమిషాల ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ ఫ్యాన్స్‌ను థియేటర్లకు పరుగులు తీయించింది.
ఇప్పటివరకు మన దేశంలో రీ-రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రికార్డు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి ది ఎపిక్’ (5 కోట్లు) పేరిట ఉండేది. ఇప్పుడు ‘ఎండ్‌గేమ్ ఎన్కోర్’ ఆ రికార్డును హాయిగా దాటేసి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే, మార్వెల్ రాబోయే చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లోకెల్లా అత్యంత ప్రమాదకరమైన విలన్ డాక్టర్ డూమ్ రాకను హింట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా, రాబోయే డూమ్స్‌డేకి గట్టి పునాది వేసింది. థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఎగబడి చూడటంతో ఎంసియుకి మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయని అనిపిస్తోంది. డిసెంబర్లో ‘డూమ్స్‌డే’ రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో ఇప్పటి నుంచే ఊహించుకోవచ్చు. ఇక, ఈ ‘ఎండ్‌గేమ్ ఎన్కోర్’ ను డైరెక్ట్ చేసిన జో-యాంతోనీ రూసో జోడీనే రాబోయే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఇన్నాళ్ళు ఐరన్ మ్యాన్‌గా మెప్పించిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఇప్పుడు విలన్‌గా డాక్టర్ డూమ్ అవతారంలోకి మారడం అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని పెంచేసింది. ఆయన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి!
Also Read
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
తాజావార్తలు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!