గబోయే కాపునాడు సమావేశం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు కాపునాడుపై వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు నేతల సమావేశం అంటూ వస‌్తున‌్న వార‌్తలు సరి కావు. ఇది సాధారణ సమావేశం మాత్రమే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. ఓ వివాహానికి వచ్చిన సందర్బంగా మాత్రమే మేం కలిశాం. కుటుంబ వ్యవహారాలు, ఒకొరొకరి యోగక్షేమాలు మాత్రమే సమావేశంలో చర్చించుకున్నాం. వైజాగులో జరిగే కాపునాడు సమావేశంపై ఎటువంటి చర్చకు రాలేదు.
Read ALso: Suguna Sundari Song Out: సుగణ సుందరి సాంగ్ వచ్చేసింది.. బాలయ్యా మాస్ ఎనర్జీ
26వ తేదీన వైజాగులో రంగా వర్ధంతి పోస్టర్లు మాత్రమే గంటా ఆవిష్కరించారు. పార్టీ మారే అంశంపై గతంలోనే ఖండించానని గంటా చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ సైతం నాదెండ్ల మనోహర్ ఉన్న సంబంధాలు నేపథ్యంలోనే కలిశామని చెప్పారు. కాపునాడు అనేది ఏ ఒక్కొరికో సంబంధించిన అంశం కాదు.. అందిరితో కూడుకున్న అంశం. 26వ తేదీన రంగా వర్దంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. కాపు నాడు సభ కాదు. కాపులకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకు న్యాయం చేసింది ఒక్క టీడీపీనే. కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు బోండా ఉమా. కొన్ని ఛానళ్లు స్నేహ పూర్వకంగా జరిగిన సమావేశాన్ని వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
Read ALso: Krishna Water Colour Change: మారుతున్న కృష్ణాజలాల రంగు.. ఆందోళనలో బెజవాడ జనం